మంచిర్యాల జిల్లా చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమ్సన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, ఎగువ నుండి వరద నీరు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ ల్లోకి వస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు గ్రామాల పునరావాస కేంద్రాల్లో వసతులపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ, పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..