Telugu Updates
Logo
Natyam ad

90 ఏళ్ల వయసులో.. తగ్గేదేలే అంటున్న తాతయ్యలు

హనుమకొండ: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో 30 ఏళ్లకే అజీర్తి.. 40 ఏళ్లకే మధుమేహం.. 50 ఏళ్లకే మోకాళ్ల నొప్పులు తన్నుకొస్తున్నాయి. 60 ఏళ్లు వచ్చే సరికి మూలన కూర్చునే పరిస్థితులు వస్తున్నాయి. కానీ, 90 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్కు చిరునామాగా నిలుస్తూ అథ్లెటిక్స్ లో పాల్గొంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు వృద్ధ యువకులు. తొమ్మిది పదుల వయసులో ఎవరైనా ఏం చేస్తారంటే.. కృష్ణా.. రామా.. అంటూ ఓ మూలన కూర్చుంటారని అనుకుంటాం. కానీ, వారిద్దరూ అలా కాదు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా మైదానంలోకి వచ్చేశారు. అథ్లెటిక్ పోటీల్లో హుషారుగా పాల్గొన్నారు. పరుగుతో పతకాలు పట్టుకొని ఇంటికి వెళ్లారు. వరంగల్ జిల్లా హనుమకొండలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఇద్దరు వృద్ధులు అందరి దృష్టికి ఆకర్షించారు.