Telugu Updates
Logo
Natyam ad

ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకంకు ఎమ్మెల్యే భూమిపూజ.

మంచిర్యాల జిల్లా: ఆయిల్ ఫామ్ తోటల సాగుతో రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. హాజీపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీలోని రాజేశ్వర్ రావు పల్లెలో ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకంకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఆయన పామాయిల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, సొసైటీ చైర్మన్ రామారావు, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లస్మయ్య, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు నహీం పాషా, తదితరులు పాల్గొన్నారు..