జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో బెల్లంపల్లి ఉపవైద్యాధికారి పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు వైద్య సిబ్బంది ఎం.ఎల్.హెచ్.పి లతో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ రాజ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాలలో ఎలాంటి అవసరాలు ఉన్నవో వాటి వివరణలను రెండు రోజులలో తెలియజేయాలని అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కావాలసినవి రాశి ఇవ్వాలని ఆదేశించారు అదే విధంగా ఆరోగ్య కార్యక్రమాల అమలులో టార్గెట్లను పూర్తిచేయాలని మాతా శిశు సంరక్షణ టీకాల కార్యక్రమాలు వంద శాతం చేయాలని అదే విధంగా సమయపాలన పాటిస్తూ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది అందుబాటులో ఉండాలని మందుల వివరములు రోజువారి చూసుకోవాలని ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉన్న మందులను తీసివేయాలని ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జాతీయ క్వాలిటీ చర్యలు చేపట్టాలని 12 ఉప కేంద్రాలలో క్వాలిటీ అస్సూరెన్స్ ప్రకారం అన్ని టార్గెట్లు పూర్తి చేయాలని టీంలు వచ్చేవరకు సిద్ధం చేసి ఉంచాలని వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఐఇసి ఉంచాలని ప్రజలతో సమన్వయంతో ఆరోగ్య కార్యక్రమాల్లో ముందు ఉంచాలని ఆదేశించారు. దీపక్ నగర్ ఆయుష్మాన్ ఆరోగ్యకేంద్రమును జాతీయ నాణ్యత ప్రమాణాల హామీ ప్రమాణాలు చూడడానికి విచ్చేస్తున్న టీంనకు అన్ని చూపించాలని ఆదేశించారు.
ఈ సమీక్ష కార్యక్రమాన్ని దీపక్ నగర్ అర్బన్ హెల్త్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఇందులో ఈ కేంద్రానికి సంబంధించిన డాక్టర్ మానస అకౌంటెంట్ మోహన్, సురేఖ సూపర్వైజర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ నాయక్ ఉపవైద్యాధికారి ప్రశాంతి డిపిఓ నాందేవ్ సబ్మిట్ అధికారి, బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి, వైద్యులు డాక్టర్ మానస, డాక్టర్ సుచరిత, డాక్టర్ రమేష్, డాక్టర్ కిరణ్, డాక్టర్ లక్ష్మణ్ డాక్టర్ అవినాష్, డాక్టర్ సంపత్ రెడ్డి, వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.