Telugu Updates
Logo
Natyam ad

పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలి..!

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

మంచిర్యాల జిల్లా: తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వంట చేసే కార్మికులకు ఇప్పటికి గత సంవత్సరం నుండి కేవలం ఒక నెల మాత్రమే వేతనాలు ఇచ్చారు. ఇంకా 7 నెలలు గడుస్తున్నా ఇప్పటికి ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో  వంటకు తెచ్చిన కిరాణంలో ఉద్దేరా కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాం. అదే విదంగా తెలంగాణ మధ్యాహ్నం భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి మాట్లాడుతూ…. మూడు నెలల కిందట ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశల్లో గౌరవ వేతనముగా రెండు వేలు పెంచారు. కానీ నెలలు గడుస్తున్నా పెంచిన వేతనాలు మాత్రం ఇంకా ఇవ్వలేదు. వర్షాలు వస్తున్నా సందర్భంలో కొన్ని పాఠశాలల్లో వంట గదులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు రాక, వేతనాలు లేక అసలు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు..

కావున ప్రభుత్వం స్పందించి పెండింగ్ మరియు పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలి… అదేవిదంగా ఉద్యోగ భద్రత సౌకర్యం కల్పించాలి. పీఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలి. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు అంజలి, నాగమణి, అనసూర్య మల్లక్క,చిన్నక్క,పోసక్క, పద్మక్క తదితరులు పాల్గొన్నారు..