Telugu Updates
Logo
Natyam ad

పోషకాహారంపై అవగాహన ర్యాలీ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని ఏసీసీ 3 అంగన్ వాడీ కేంద్రంలో సోమవారం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఇందిర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోషకాహారంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతారన్నారు. అంగన్ వాడీ కేంద్రంలో అందిస్తున్న సేవలను చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్ ఎన్ పద్మ, సహాయకురాలు లత పాల్గొన్నారు.