నిర్దవెల్లిలో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్
రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామంలో మంగళవారం ముస్లిం సోదరులు ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గ్రామ సమీపంలోని ఈద్గా వద్ద నిర్దవెల్లి, లేమామిడి ,కాకునూర్ ,లింగంధన, తొమ్మిది రేకుల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఈద్గా వద్ద చేరుకొని. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ను ఆచరించారు.. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.కేశంపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ తో పాటు స్థానిక నాయకులు ముస్లిం సోదరులకు రంజాన్ శభాకాంక్షలు తెలిపారు..