Telugu Updates
Logo
Natyam ad

నిఖత్ జరీన్ కు రూ.5లక్షల నజరానా ప్రకటించిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ స్వర్ణ పతకం సాధించిన నిఖత్ జరీను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభినందించి రూ.5లక్షల నజరానా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. నిజామాబాద్ నుంచి ఇస్తాంబుల్ వరకు జరీన్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తోందని కొనియాడారు. గతంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్, సానియా మీర్జాలకు ఇచ్చినట్లు నిఖత్ జరీన్ కు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పారితోషికం ఇచ్చి ఆదరించాలని రేవంత్ రెడ్డి కోరారు..