ఇంత అవినీతి ప్రభుత్వాన్ని, అసమర్థ నేనెప్పుడూ చూడలేదు
కేసీఆర్ ను తరిమితేనే రజాకార్ పాలన అంతం
ఒక్క హామీనీ నెరవేర్చకుండానే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి
నిధులు, నీళ్లు నియామకాలు నెరవేరుస్తాం
మైనారిటీ రిజర్వేషన్లు తగ్గిస్తాం
ముందస్తు ఎన్నికల యోచనలో కేసీఆర్
అందుకు మేమూ సిద్ధమే
ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో అమిత్ షా
తెలంగాణ నుంచి నయా నిజాం నవాబును వెళ్లగొట్టాలా వద్దా… పాలనలో మార్పు రావాలని కోరుకునేవారంతా చేతులు పైకెత్తి మద్దతు తెలపండి. ప్రజా సంగ్రామ యాత్ర భాజపా అధికారం కోసమో.. ఒకరిని దించి మరొకరిని సీఎంగా చేయడానికి కాదు. దళితులు, ఆదివాసీ, యువత, రైతుల సంక్షేమానికి చేస్తున్న యాత్ర. రాష్ట్రంలో రజాకార్ ప్రతినిధి కుటుంబ పాలన సాగుతోంది. “నా కొడుకు, నా బిడ్డ” అంటూ కేసీఆర్ సాగిస్తున్న అవినీతి పాలనను అంతమొందించడానికే ఈ యాత్ర.
హైదరాబాద్: తెలంగాణలో రజాకార్ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు, ప్రస్తుత నిజాం ప్రభువైన ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమితా తెలిపారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని, పనికిమాలిన, అసమర్థ ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా శనివారం తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభకు అమిత్ షా తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కమీషన్లు వచ్చే ప్రాజెక్టులనే కేసీఆర్ పూర్తి చేస్తారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఎవరో తాంత్రికుడు చెప్పాడని సీఎం సచివాలయానికి వెళ్లడం లేదన్నారు. కేసీఆర్ను తరిమేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని, ఆయనను గద్దె దించేందుకు యువత కదిలి రావాలన్నారు. తెలంగాణ ఎవరి జాగీరూ కాదని, అందరికీ సమానహక్కు ఉందన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ మరో బెంగాల్గా మారుస్తున్నారని, హత్యా రాజకీయాలతో తమ కార్యకర్త సాయిగణేశ్ను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అందుకు బాధ్యులైన వారిని జైలుకు పంపుతామన్నారు. తెరాస, మజ్లిస్ పార్టీలు అవిభక్త కవలలని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సన్నాహాల్లో ఉన్నారని, ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్ ను, మజ్లిస్ నన్ను గద్దె దించిన నాడే తెలంగాణకు విమోచన అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక.. మైనార్టీల రిజర్వేషన్లు తగ్గించి ఎస్సీ, ఎస్టీలకు కోటా పెంచుతామన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సతోపాటు తెలంగాణలోనూ భాజపా ప్రభుత్వం ఏర్పడాలని.. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ప్రభుత్వం తరపునే ఉప్పుడు బియ్యం కొంటామని హామీ ఇచ్చారు..