Telugu Updates
Logo
Natyam ad

జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా గంగారెడ్డి.

ఆంజనేయులు న్యూస్, నిజామాబాద్ జిల్లా: జాతీయ పసుపు బోర్డు సంస్థ ఛైర్మన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని నియమిస్తూ భారత ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి నుంచి ఎంపి అరవింద్ కు అత్యంత సన్నిహితులుగా ఉంటూనే పార్టీలో కీలక నేతల్లో ఉన్నారు. పల్లె గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పసుపు ప్రాంతానికి ప్రత్యేకంగా నిలిచిన ఆర్మూర్ కు చెందిన రైతు గంగారెడ్డి కావడంతో స్థానిక రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.