హైదరాబాద్: గంజాయి కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గంజాయి సరఫరా కేసులో నిందితుడు నదీమ్ ను దోషిగా నిర్ధారిస్తూ న్యాయస్థానం అతనికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ. లక్ష జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. 2020 ఆగస్టులో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి పంతంగి టోల్ గేట్ వద్ద యూపీ 21 సీఎన్ 0853 నంబర్ ఉన్న ట్రక్కును పోలీసులు అడ్డగించి 1,427 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తర్వాతి రోజు డ్రైవర్ నదీమ్ (25) ను డీఆర్ఐ అరెస్ట్ చేసింది..