Telugu Updates
Logo
Natyam ad

ఎమ్మార్పీఎస్ జిల్లా కోకన్వీనర్ గా గ్యార సురేష్

రంగారెడ్డి జిల్లా కేశంపేట:ఎమ్మార్పీఎస్ జిల్లా కోకన్వీనర్ గా కేశంపేట మండల అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న కొనాయిపల్లి గ్రామానికి చెందిన గ్యారసురేష్ మాదిగ నియమితులయ్యారు. దీంతో మంగళవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను గ్యార సురేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు చిర్ర శ్రీనుమాదిగతో కలిసి హైదరాబాద్ లోని స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా ఆయనను శాలువా పూలమాలలతో సన్మానించారు.ఈ సందర్భంగా గ్యార సురేష్ ను శాలువాతో సన్మానించిన మందకృష్ణ మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తే గుర్తింపు దానంతట అదేవస్తుందని ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఎమ్మార్పీఎస్ కేశంపేట మండలాధ్యక్షునిగా కష్టపడి పనిచేయడం ద్వారా గుర్తింపు లభించి ఎమ్మార్పీఎస్ జిల్లా కోకన్వీనర్ గా నియామకం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో నాకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తానని సురేష్ తెలిపారు.