Telugu Updates
Logo
Natyam ad

ఎంపీడీవోపై సస్పెన్షన్ వేటు..!

హుజూరాబాద్: ఎంపీడీవో బి.రమేష్ ను జిల్లా పాలనాధికారి ఆర్.వి.కర్ణన్ శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. హుజూరాబాద్ మండలం రంగాపూర్ లో శ్మశానవాటిక నిర్మాణ పనులను సకాలంలో పూర్తిచేయకపోవడంతో పాటు మండల పరిషత్తు నిధులు రూ.1,17,38,598కు ఆడిట్ జరగ్గా వచ్చిన అభ్యంతరాలపై సరైన నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. పనుల పెండింగ్ విషయంలో గతంలో రెండు మార్లు షోకాజ్ నోటీసులను జారీ చేసినా ఆయా విషయాలపై సరైన జవాబు ఇవ్వకపోవడంతో ఎంపీడీవోపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు..