Telugu Updates
Logo
Natyam ad

మరో శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.!

తెలంగాణ: తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ వరుసగా శుభవార్తలు చెబుతూ వస్తోంది. భారీ నోటిఫికేషన్లను విడుదల చేయడంతో నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణలో త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. బాన్సువాడలో 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమం నిర్వహించగా ఈ సందర్భంగా హరీష్ రావు ఈ శుభవార్తను ప్రకటించారు..