Telugu Updates
Logo
Natyam ad

మొన్న చెట్లకు వింత వైరస్..నేడు కన్నులతో సాక్షాత్కారం

 

 

*వేప చెట్టులో అమ్మవారు రూపం.*

*తండోపతండాలుగా సందర్శకులు.*

*సర్ధార్ నగర్ లో వింత సంఘటన.

షాబాద్: బ్రమ్మంగారు చెప్పింది నిజమే అనిపించేలా రోజురోజుకు వింతలు బయటపడుతూ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది నేటి ఆధునిక(టెక్నాలజీ)యుగంలో ఈప్పటికే పందికి పిల్లి పుట్టడం,గోమాత కడుపులో గొర్రె పిల్లలు పుట్టడం చాలానే చూశాము,విన్నాము.మరి మున్ముందు ఇంకేం చూస్తామో ఎవరికి ఎరుక… ఇప్పుడెందుకు ఇదంతా అనుకునేరు అక్కడికే వస్తున్నా… మొన్ననే ఆకాశంలో ఒక వింత ఆకారం చంద్రుణ్ణి వీక్షించాము,నిన్న మొన్న కురిసిన వర్షాలకు భద్రాచలం సీతారాముల ఆలయంలోకి భారీ వరద నీరు రావడంతో యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఏమౌతుందోనని ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యారు.అంతెందుకు గత సంవత్సరం కిందట వేప చెట్లకు వింత వైరస్ వచ్చి చెట్లన్నీ మాడిపోయిన దృశ్యాలు మన కళ్ళముందు కనబడుతూనే ఉన్నాయి.ఇంతలో మరో అద్భుతం.ఇక వివరాల్లోకి వెళితే వేప చెట్టుకు కన్నులు (పుట్టిన)బయల్పడిన వింత సంఘటన ఒకటి చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సర్ధార్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ పశువుల దవాఖాన వద్ద వేప చెట్టు కొమ్మల మధ్యన అచ్చం మనిషి కన్నులను పోలిన రూపంలో ఉంది.వేపచెట్టుకు స్థానికులంతా పసుపు, కుంకుమ, అగరుబత్తులతో పూజలు చేస్తున్నారు. వేపచెట్టుకు కన్నులు రావడంతో అమ్మవారి మహిమ అని చుట్టుపక్కల మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఆ వేపచెట్టుకు పూజలు నిర్వహిస్తున్నారు.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అటుగా వచ్చి వెళ్లే ప్రతిఒక్కరూ ఆ వేపచెట్టును పూజించి మొక్కులు తీర్చుకుంటున్నారు.సాక్ష్యత్తు అమ్మవారే ఆ వేపచెట్టులో వెలసిందనే నమ్మకంతోనే తాము పూజలు చేస్తున్నామని చెబుతున్నారు అక్కడి మహిళలు.ఈ వింతను చూడటానికి గ్రామస్థులు తండోపతండాలుగా వస్తున్నారు.పూజలు కూడా నిర్వహిస్తుండటం విశేషం..సాక్ష్యత్తు అమ్మవారే ఆ వేపచెట్టులో వెలసిందనే నమ్మకంతోనే తాము పూజలు చేస్తున్నామని చెబుతున్నారు అక్కడి మహిళలు.కాలజ్ఞానంలో బ్రమ్మంగారు చెప్పింది అక్షర సత్యం అని అంటున్నారు.ఈ వింత చూడటానికి పరిసర ప్రాంతాల నుండి వస్తున్నారు.అయితే స్థానిక ప్రజలు ఏమంటున్నాంరంటే గతంలో ఇక్కడ అమ్మవారు కొలువై ఉండేదని,అందువలన వేప చెట్టుకు అమ్మవారి రూపం పోలిన విధంగా రెండు కన్నులతో తయారు అయ్యిండొచ్చని స్థానిక గ్రామ ప్రజలు, పెద్దలు చెబుతున్నారు.ఏదైమైనా గానీ నేటి ఆధునిక(టెక్నాలజీ)కాలంలో కూడా అమ్మవారి రూపాన్ని పోలినట్లు , రెండు కన్నులతో ఉండటం దేనికి సంకేతం ఇస్తోందో  మరి కాలమే చెప్పాలి…