Telugu Updates
Logo
Natyam ad

అమ్మకు మోదీ పాదాభివందనం..!

గుజరాత్: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల భాజపా అఖండ విజయం సాధించిన అనంతరం ప్రధాని మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్ పర్యటన చేపట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ కు చేరుకున్న మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తల్లి హీరాబెన్ను కలిశారు. శుక్రవారం రాత్రి 9గంటలకు గాంధీనగర్ శివారులోని రైసిన్ లో తన సోదరుడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ ఉన్న తన మాతృమూర్తికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తల్లితో కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భాజపా విడుదల చేసింది..