Telugu Updates
Logo
Natyam ad

మానవత్వం చాటుకున్న మంచిర్యాల పోలీస్..!

మంచిర్యాల జిల్లా: గాదం ప్రవీణ్ అనే యువకుడు తన తల్లి వినోద కు రోజు వేసుకునే టాబ్లెట్స్  వేసుకోక పోవడం వల్ల ఛాతీ లో నొప్పితో  తల్లి విలవిలలాడటం తో టాబ్లెట్స్ కోసం రాత్రి ఒంటిగంట సమయంలో  మందుల దుకాణం కోసం వెతుకుతుండ గా నైట్ పెట్రోలింగ్ చేస్తున్న మంచిర్యాల ఎస్ ఐ జి.హరిశేఖర్ ఆ యువకుడిని విధుల్లో  భాగంగా ఆపి ఈ సమయం లో బయట ఎందుకు తిరుగుతున్నావూ అని ప్రశ్నించడంతో ఆ యువకుడు విషయం చెప్పగా ఎమర్జెన్సీ ని గ్రహించి వెంటనే పోలీస్ వాహనం లో తీసుకొని వెల్లి మందుల దుకాణం లో టాబ్లెట్స్ తీసుకొని మల్లి ఆ యువకుని ఇంటి వద్ద దింపి రావడంతో  ఆ యువకుడు ఎంతో సంతోషం వ్యక్తం చేసాడు. తన తల్లికి కావలిసిం  టాబ్లెట్స్ కోసం చాల సమయం నుండి మార్కెట్ లో కాళి నడకన వెతుకుతుంటే ఒక్క షాపు కూడా దొరుకలేధు చాలా గాభర పడిపోయాను సర్ మీ వల్ల మా తల్లి కి కావలసిన టాబ్లెట్స్ త్వరగా దొరికాయి  అంటూ ఆ యువకుడు ఏంతో సంతోషం తో ఎస్ఐ గారికి కృతజ్ఞతలు తెలియజేసాడు ఆ యువకుడు. చేసిన చిన్న సహయినికే ఆ యువకుడు చూపిన  కృతజ్ఞతకు ఎస్ ఐ గారు కూడా సంతోషం వ్యక్తం చేసారు.