Telugu Updates
Logo
Natyam ad

సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే..!

ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ పట్టణంలో గురువారం ఎమ్మెల్యే జోగురామన్న పర్యటించారు. ఈ సందర్భంగా వినాయక్ చౌక్ వద్ద వీధి వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వ్యాపారం సాగుతున్న తీరును వీధి వ్యాపారులను అడిగారు. పట్టణంలో ప్రధాన కూడళ్ళ సుందరీకరణ లో భాగంగా రోడ్డు వెడల్పు పనుల్లో జరుగుతున్నాయని వాటికి సహకరించాలని కోరారు. వ్యాపారులకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజా రెడ్డి, మాజి మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు యూనిస్ అక్బనీ, తదితరులు పాల్గొన్నారు..