Telugu Updates
Logo
Natyam ad

దివాకరన్న పెరుగన్నం పంపిణీ ప్రారంభం..!

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివాకరన్న పెరుగన్నం పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ఐబీ ప్రాంతంలో వేసవికాలంలో ప్రజల దాహార్తిని, ఆకలిని తీర్చేందుకు నిత్యం పెరుగన్నం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్, టిఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు, తదితరులు పాల్గొన్నారు.