Telugu Updates
Logo
Natyam ad

మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు..?

మంచిర్యాల జిల్లా: రాష్ట్ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సోమవారం హైదరాబాద్ లో మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు. ఈనెల 15న చెన్నూరు నియోజకవర్గంలోని గంగారం, కిష్టంపేట, తుంతుంగ బ్రిడ్జ్, సుబ్బరాంపల్లి బ్రిడ్జీలను ప్రారంభించేందుకు రావాలని, అలాగే రూ. 10 కోట్లతో సుద్దాల వాగుపై నిర్మించే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయాలని విప్ బాల్క సుమన్ మంత్రిని ఆహ్వానించారు..