Telugu Updates
Logo
Natyam ad

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యేలు..!

తెలంగాణ: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను మంగళవారం మంచిర్యాల జిల్లాలోని శాసనసభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ నియోజకవర్గాల పరిధిల్లో ఉన్న మున్సిపాలిటీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ పాల్గొన్నారు..