మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని మిమ్స్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి శైలజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే బిల్డింగులో కేజీ టు పీజీ తరగతులతో పాటు అనుమతి లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్నారని తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వెంటనే మిమ్స్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, అల్లి సాగర్, సబ్బని రాజేంద్రప్రసాద్, జుమ్మిడి గోపాల్, చేరాలవంశీ, నాగ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు..