Telugu Updates
Logo
Natyam ad

మెట్రోస్టేషన్ పైనుంచి దూకిన యువతి.?

ప్రాణాలు కాపాడిన జవాన్లకి సెల్యూట్

దిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో అక్షరధామ్ మెట్రో స్టేషన్ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువతిని CISF సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. ఈ ఉదయం 7.30 గంటల సమయంలో స్టేషన్లో ని ప్లాట్ఫాం నంబర్ 2 అంచుకు వెళ్లి నిలబడిన యువతిని కొందరు ప్రయాణికులు గమనించి సమాచారం ఇవ్వగా.. అప్రమత్తమైన CISF సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొన్నారు. ఆత్మహత్య చేసుకోవద్దంటూ ఎంతగానో నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె పట్టించుకోకుండా ఒక్కసారిగా కిందకు దూకేసింది. దీంతో స్థానికుల సాయంతో ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసిన బ్లాంకెట్ తో ఆమెను పట్టుకున్నారు. దీంతో ఆ యువతికి ప్రాణాపాయం తప్పింది. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో యువతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించినట్లు CISF అధికార ప్రతినిధి వెల్లడించారు..

ఆత్మహత్యకు ప్రయత్నించిన యువతిని పంజాబ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆమె వయసు 20 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను CISF అధికారిక ట్విటర్ లో పోస్ట్ చేసింది. “సీఐఎస్ఎఫ్ సిబ్బంది సత్వర, తెలివైన స్పందన ఓ యువతి ప్రాణాల్ని కాపాడింది” అని ప్రశంసించింది. సకాలంలో స్పందించి యువతి ప్రాణాల్ని కాపాడిన జవాన్లకు సెల్యూట్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.