ఆంజనేయులు న్యూస్, అదిలాబాద్ జిల్లా: భైంసా పట్టణ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా ఎదిగాయి. హరితవనాన్ని తలపిస్తున్న చెట్ల మధ్య ఓ గంజాయి మొక్క కూడా ఏపుగా 10 అడుగుల ఎత్తు పెరిగింది. చెట్ల మధ్య రాలిన ఆకు, చెత్తాచెదారం శుభ్రం చేసే సిబ్బంది కంటపడకుండా ఇంత ఎత్తు ఎలా పెరిగిందనే ప్రశ్న తలెత్తుతోంది. ఎవరైనా కావాలనే పెంచుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందలాది మంది రోగులు వచ్చే ఆసుపత్రిలో పెరుగుతున్న గంజాయి మొక్క ఎవరి కంట పడకపోవడం గమనార్హం.
