Telugu Updates
Logo
Natyam ad

నిమ్మకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..?

నిమ్మకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 నిమ్మకాయలు ఎండా కాలంలో ఒంట్లో వేడిని తగ్గించడానికి తోడ్పడుతాయి.

నిమ్మరసం యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది.

నిమ్మలో సి విటమిన్ అధికంగా లభిస్తుంది.

• తరచూ నిమ్మరసం తీసుకుంటే చర్మం త్వరగా ముడుతలు పడదు. దీంతో వృద్ధాప్య చాయలు త్వరగా దరిచేరవు.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడి తగ్గి, నూతన ఉత్సాహం వస్తుంది.

పంటినొప్పిని తగ్గించడంలో నిమ్మరసం తోడ్పడుతుంది. చిగుళ్లలోంచి రక్తం వచ్చేవారు తరచూ నిమ్మరసం తీసుకోవడంవల్ల ప్రయోజనం  ఉంటుంది.

కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను తొలగించి, శుద్ధి చేయడంలో నిమ్మరసం సహాయపడుతుంది.

వేసవిలో నిమ్మరసం తాగితే అలసట నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

 స్థూల కాయం ఉన్నవారు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.

నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించడంలో కూడా తోడ్పడుతుంది.