Telugu Updates
Logo
Natyam ad

మంచిర్యాల జిల్లా జ్యుడీషియల్ కోర్టు ప్రారంభం..?

మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టులో భాగంగా మంచిర్యాల జిల్లా జ్యుడీషియల్ కోర్టును గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్య మంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టులో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి. బి. సత్తయ్య బాధ్యతలు స్వీకరించి న్యాయ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి సత్తయ్య మాట్లాడుతూ జిల్లా కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయసేవలు అందుబాటులోకి వచ్చి, తక్షణ న్యాయం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్య క్రమంలో మొదటి అదనపు న్యాయమూర్తి మైత్రేయి, సీనియర్ న్యాయమూర్తి ఉదయ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు..