Telugu Updates
Logo
Natyam ad

ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్..!

వివరాలు వెల్లడించిన మంచిర్యాల ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్

మంచిర్యాల జిల్లా: రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్, ఏసిపి రష్మీ పెరుమాళ్, సిఐ నారాయణ నాయక్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న కోట రవి అనే నిందితున్ని మంగళవారం రాత్రి మంచిర్యాల పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ మాట్లాడుతూ… కోటపల్లి మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన నిందితుడు మంచిర్యాల, హాజీపూర్, మందమర్రి, కాసిపేట ప్రాంతాల్లో హ్యాండిల్ లాక్ చేసిన తొమ్మిది బైక్ లు చోరీ చేసినట్లు తెలిపారు. స్థానిక ఐబీ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితున్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుని నుండి రూ.4 లక్షలు విలువ చేసే చోరీ సొత్తును సీజ్ చేసినట్లు తెలిపారు.

నిందితున్ని అరెస్ట్ చేసి, చోరీ సొత్తు రికవరీ చేసిన పట్టణ సిఐ నారాయణ నాయక్, సీసీఎస్ సిఐ మోహన్, ఎస్సైలు గంగారాం, మహేందర్, హెడ్ కానిస్టేబుల్ దివాకర్, కానిస్టేబుళ్లు సతీష్, శ్రీనివాస్, సునీల్, శ్రీనివాస్ లను డిసిపి అభినందించి రివార్డు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎసిపి సాధన రేష్మి పెరుమాళ్ పాల్గొన్నారు..