ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మాదాపూర్ లోని ఓ బార్ అండ్ రెస్టారంట్లో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. రాయదుర్గం నాలెడ్జి సిటీ సత్వ భవనంలో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సిలిండర్లు పేలడంతో భవనం పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంతో సమీపంలో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులను అధికారులు అక్కడి నుంచి పంపించివేశారు. (Hyderabad News)