Telugu Updates
Logo
Natyam ad

లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.?

రామగుండం సీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి

మంచిర్యాల జిల్లా: లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. లోన్ తీసుకోండి. నెలనెలా కొంత మొత్తాన్ని తీర్చేయండి అని ఫోన్ లో మెసేజ్ చూసి నమ్మితే నట్టేట మునిగినట్టేనన్నారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ లను అనుమతించవద్దని, వ్యక్తిగత ఫోటోలు వివరాలు కూడా సామాజిక మాధ్యమాలలో ఉంచకపోవడం మంచిదని పేర్కొన్నారు. అలాగే వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లని చూసి భ్రమపడి ఎవరికీ డబ్బులు పంపవద్దని సూచించారు.

సైబర్ మోసం జరిగిన వెంటనే స్పందించి 1930కి కాల్ చేస్తే మోసపూరిత డబ్బు సైబర్ నేరగాళ్ల చేతికి పోకుండా ఫ్రీజ్ చేయవచ్చని తెలిపారు. NCRP portal (www. cybercrime. gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారని సిపి వెల్లడించారు.