Telugu Updates
Logo
Natyam ad

రేపు జాతీయ మెగా లోక్ అదాలత్..

మంచిర్యాల జిల్లా: న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల జిల్లా కోర్టులో ఉదయం 10 గంటలకు జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పట్టణ సిఐ నారాయణ నాయక్ తెలిపారు. లోక్ అదాలత్ ల ద్వారా కేసులు పరిష్కరించుకుంటే సత్వరం న్యాయం చేకూరుతుందన్నారు. కేసులు ఎదుర్కొంటున్న ఇరువర్గాల సమస్యను న్యాయమూర్తులు రాజీమార్గంలో పరిష్కారిస్తారని పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పిట్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులతో పాటు సివిల్ దావాలు, నష్టపరిహారం కోరుతూ దాఖలైన కేసులు పరిష్కరించుకోవచ్చని సిఐ సూచించారు. లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు..