Telugu Updates
Logo
Natyam ad

ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు కసరత్తు..!

రేపటితో ముగియనున్న గడువు..

హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న స్థలాల క్రమబద్ధీకరణ కోసం దాదాపు 1.50లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. 58, 59 ఉత్తర్వులకు లోబడి క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం గత నెల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. మీ సేవా కేంద్రాల ద్వారా ఫిబ్రవరి 21 నుంచి దరఖాస్తు చేసుకుంటున్నారు. 2014 జూర్ 2వ తేదీ కటాఫ్ 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. ఆపై విస్తీర్ణం ఉన్న స్థలాలకు నిర్ణీత రుసుము వసూలు చేస్తారు. క్రమబద్ధీకరణ కోసం ఇప్పటి వరకు 1,47,268 దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అందులో ఉచిత క్రమబద్ధీకరణ కోసం 58 జీవో కింద 87,520 దరఖాస్తులు రాగా, జీవో 59కింద క్రమబద్ధీకరణ కోసం 59,748 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు సమర్పించేందుకు గడువు గురువారంతో ముగియనుంది.