మంత్రి కేటీఆర్ తో మేఘాలయ సీఎం భేటీ..!
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా భేటీ అయ్యారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన.. ప్రగతిభవన్ లో కేటీఆర్ ను కలిశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. అనంతరం కన్రాడ్ సంగ్మా దంపతులను కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.