Telugu Updates
Logo
Natyam ad

కేటీఆర్ తో అసదుద్దీన్ ఒవైసీ కీలక భేటీ..

హైదరాబాద్: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. నేరుగా అసెంబ్లీకి వచ్చి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మండలిలోని ఖాళీలను భర్తీ చేస్తున్నందున ఎంఐఎంకు కొన్ని పదవులు ఇవ్వాలని కోరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. డలి డిప్యూటీ ఛైర్మన్, విప్ పదవి కోసం అసద్ సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే వాటిని అసద్ కొట్టి పారేశారు. తాజా రాజకీయాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలపై చర్చించామని, ఆ ప్రభావం తెలంగాణలో ఉండదని అన్నారు..