Telugu Updates
Logo
Natyam ad

కేంద్రమిచ్చే రూ.200-300 కోట్లు ఏ మూలకు సరిపోతాయి?: కేటీఆర్

గుజరాత్ కు మాత్రం రూ. వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు..

హైదరాబాద్: హైదరాబాదు విశ్వనగరంగా మార్చేందుకు శ్రమిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో మురుగునీరు, మంచినీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ పారిశుద్ధ్యం నిర్వహణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు.. “హైదరాబాద్ లో రూ.3,866 కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్ఓపీ) ఏర్పాటు చేస్తున్నాం. ఈ డిసెంబర్ నాటికి వందశాతం ఎస్టీపీ పనులు పూర్తి అవుతాయి. హైదరాబాద్ లో 37 చోట్ల ఎస్టీపీలు నిర్మిస్తున్నాం. హైదరాబాదు రెండు వేల ఎంఎల్డీల మురుగునీటి శుద్ధీకరణ సామర్థ్యం ఉంది. హైదరాబాద్ కు సాయం అడుగుతే కేంద్రం పెద్దలు అమృత్ లో చేరమన్నారు. లక్షకు పైగా జనాభా ఉన్న నగరాలు అమృత్ లో చేరాలన్నారు. హైదరాబాద్ లో కోటికి పైగా జనం నివసిస్తున్నారు. కేంద్రం ఇచ్చే రూ.200-300 కోట్లు ఏ మూలకు సరిపోతాయి?  హైదరాబాద్ లో గతేడాది వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కేంద్ర పెద్దలు చాలా మంది వరద ప్రాంతాలకు సందర్శించి పట్టించుకోలేదు. పైసా సాయం చేయలేదు. గుజరాత్ కు మాత్రం రూ. వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు” అని కేటీఆర్ అన్నారు.