Telugu Updates
Logo
Natyam ad

రైతులను రెచ్చగొట్టి వరి వేయించారు: కేటీఆర్

హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎం కేసీఆర్ రైతులకు ముందే సూచించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ.. రైతులను రాష్ట్ర భాజపా నేతలు రెచ్చగొట్టి వరి వేయించారన్నారు. ఇప్పుడు యాసంగి ధాన్యం కొనమంటే కేంద్రం నాటకాలు ఆడుతోందని కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని.. ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు..