Telugu Updates
Logo
Natyam ad

చిరంజీవిపై కోట శ్రీనివాసరావు ఫైర్.!

ఆంజనేయులు న్యూస్: మెగాస్టార్ చిరంజీవిపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా సినీ కార్మికులపై చిరంజీవి వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ కార్మికుల కోసం ఓ ఆసుపత్రి కట్టిస్తానని ఆయన హామీనిచ్చారు. దీనిని స్వయంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ధ్రువీకరించి, అందుకు స్థలం కూడా కేటాయిస్తామని చెప్పారు. దీనిపై కోట శ్రీనివాసరావు మండిపడ్డారు. చిరంజీవి ఇచ్చిన హామీలు ప్రచారానికి తప్పితే, అమలు చేయడానికి ఉపయోగపడవని అన్నారు. అటువంటి అనవసర హామీలను ఇవ్వడం చిరంజీవి మానుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ చిరంజీవి హామీలపై కోట ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినీ కార్మికులు ఉపాధి లేక అల్లాడుతున్నారని అన్నారు. వారికి ఉపాధి చూపించాలని చిరంజీవిని కోరారు. అంతేకానీ ఆకలితో అలమటిస్తుంటే ఆసుపత్రి కట్టిస్తా అనడంలో అర్థం లేదన్నారు. వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే సినీ కార్మికుల వద్ద డబ్బులు ఉంటాయని, వాటితో వారికి నచ్చిన ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటారని చెప్పారు. సినీ పెద్దలు తీసుకునే ఏ నిర్ణయాలైనా వారికి పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. అంతేకానీ వ్యక్తిగత ప్రచారాల కోసం ఇష్టానుసారంగా హామీలు ఇవ్వడం సరికాదన్నారు.