Telugu Updates
Logo
Natyam ad

కేజ్రివాల్ మోములో విజయ దరహాసం.. గురుద్వారాకు భగవంత్ మాన్

సీఎం అభ్యర్థి ఇంటి వద్ద కార్యకర్తల

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి ఆప్ విజయాన్ని దాదాపు ఖరారు చేసింది. దాంతో ఆ పార్టీ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ మొహంలో ఆనందం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తన పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోన్న తరుణంలో ఆయన గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. సంూర్లోని శ్రీ మస్తువానా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. పంజాబ్ బంగారు భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేసినట్లు వెల్లడించారు. తన పర్యటనకు సంబంధించిన చిత్రాలను నెట్టింట్లో షేర్ చేశారు. మరోపక్క భగవంత్ మాన్ ఇంటివద్ద కార్యకర్తల సందడి నెలకొని ఉంది. అక్కడ పెద్ద పాత్రల్లో జిలేబీతయారు చేస్తోన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఎన్నికల కౌంటింగ్కు ముందురోజు భగవంత్ మాన్ మాట్లాడుతూ.. ఒకవేళ తాను ముఖ్యమంత్రి అయినా ఆ విజయం తన తలకెక్కదన్నారు. ‘అప్పుడు కూడా నేను ప్రజల మధ్యలో ఉండి, వారితో పనిచేస్తాను. ప్రజలు పాత పంజాబ్ను తిరిగి కోరుకుంటున్నారు. పంజాబు పంజాబ్ నే ఉంచుతాం. పారిస్, లండన్, కాలిఫోర్నియాగా దాన్ని మార్చాల్సిన అవసరం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు..