Telugu Updates
Logo
Natyam ad

నేడు నగరంలో సీఎం కేసీఆర్ పర్యటన..!

గడ్డిఅన్నారంలో ఆసుపత్రి నిర్మించేది ఇక్కడే

హైదరాబాద్  నారాయణగూడ: గడ్డి అన్నారంలోని పాత పండ్ల మార్కెట్, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణం, అల్వాల్ రైతుబజార్ ఎదురుగా నిర్మించతల పెట్టిన ‘టిమ్స్ ‘ఆసుపత్రుల’ పనులకు మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ప్రకటనలో తెలిపారు. అల్వాల్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు తిరుమలగిరి కూడలి నుంచి బొల్లారం చెక్పోస్ట్ వరకు, బొల్లారం చెక్పోస్టు నుంచి తిరుమలగిరి కూడలి వరకు రద్దీ ఉంటుందని పేర్కొన్నారు..

మళ్లింప్పు ఇలా…

జేబీఎస్ నుంచి కరీంనగర్ హైవే వైపు టీవోలి కూడలి మీదుగా బ్రూక్ బాండ్ వైపు, బాలంరాయి, తాడ్ బండ్, బోయినపల్లి నుంచి సుచిత్ర, మేడ్చల్ నుంచి ఓఆర్ఆర్ వరకు.

హోలీ ఫ్యామిలీ జంక్షన్ వద్ద లఫేటర్న్ తీసుకొని ఖానాజీగూడ వైపు, డైరీఫామ్ వద్ద కుడివైపు తీసుకొని సుచిత్ర, కొంపల్లి నుంచి మేడ్చల్, ఓఆర్ఆర్ వైపు.

తెలంగాణ తల్లి విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఎడమ వైపు నుంచి సుచిత్ర జంక్షన్, కొంపల్లి, మేడ్చల్ ఓఆర్ఆర్ వైపు,

ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కుడి పైపు బొల్లారం చెక్పోస్టు నుంచి కరీంనగర్ హైవే మీదుగా హైదరాబాద్ వైపు. ఓఆర్ఆర్ శామీర్పేట్, ఓఆర్ఆర్ ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు, ఓఆర్ఆర్ కండ్లకోయ కొంపల్లి నుంచి సుచిత్ర మీదుగా బోయినపల్లి వైపు.

దొంగల మైసమ్మ దేవాలయం/బిట్స్ జంక్షన్ చీరియా నుంచి కీసర, కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డు నుంచి మౌలాలి మీదుగా తార్నాక వరకు.

తూముకుంట ఎన్టీఆర్ విగ్రహం నుంచి దేవరయంజాల్ వైపు, మెడికవర్ ఆసుపత్రి నుంచి కొంపల్లి, సుచిత్ర బోయినపల్లి వైపు వెళ్లాలి. బొల్లారం చెక్పోస్టు వద్ద ఎడమ నుంచి కౌకూరు వైపు, యాప్రాల్ నుంచి లోతుకుంట, లాల్బజార్, తిరుమలగిరి వైపు వెళ్లాలి..