కేసీఆర్ లేదా కేటీఆర్ రావాల్సిందే..?
బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల భారీ నిరసన
బాసర: నిర్మల్ జిల్లా బాసర (Basara) ఆర్జీయూకేటీ(RGUKT)లో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యాలయంలో నెలకొన్న సమస్యలు, సౌకర్యాల కొరత, సామగ్రి సరఫరాలో యాజమాన్యం నిర్లక్ష్యంపై మంగళవారం నుంచి ఆందోళన చేస్తున్న విద్యార్థులు.. బుధవారం కూడా నిరసన కొనసాగించారు. సుమారు 6వేల మంది విద్యార్థులు మెయిన్ గేటు వద్ద బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు..