Telugu Updates
Logo
Natyam ad

సీఎం కేసిఆర్ ను కలసిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు..?

ఎమ్మెల్యేలు, కోనేరు కోనప్ప, అత్రం సక్కు, జోగురామన్న, దివాకర్ రావు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: కొమురంభీం జిల్లాలోని పలు సమస్యలపై సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకవేళ్లగా సానుకూలంగా స్పందించి తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం కేసిఆర్ ఆదేశించారు..

కొమురంభీమ్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసిఆర్ ను కోరగా వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరి స్మితా సబర్వల్ గారిని త్వరలో ప్రాజెక్టు లను విజిట్ చేసి, అధ్యయనం చేసి పూర్తి వివరణ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు..

జిల్లాలో నెలకొన్న పోడు భూముల సమస్యల పై సీఎం గారి దృష్టి కి తీసుకెళ్ళగా.. గతంలో ఆదేశాలు ఇచ్చిన విధంగా స్టేటాసుకో మెంటన్ చేయాలని ఫారెస్ట్ ఉన్నతాధికారులను అదేశాలిచ్చారు. త్వరలో ఫారెస్ట్ భూములకు పట్టాలిస్తామని ఆ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని హామి ఇచ్చారు..

కొమురంభీం జిల్లాలో గిరిజిన గ్రామాలలో కనెక్ట్ విటీ రోడ్లు కావలని సియం గారిని  అడగగా అన్ని గిరిజన గ్రామలను కలుపుతూ రోడ్లు ఉండేలా రూపకల్పన చేయాలని దీని పై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు..

గిరిజన గ్రామాలో త్రీ ఫేస్ కరెంటు ఇవ్వాలని సీఎం గారిని కోరగా.. గిరి వికాసం కింద గిరిజన గ్రామాలలో త్రీ ఫేస్ కరెంటు ఇవ్వడానికి హామి ఇచ్చారు.. అదే విధంగా ప్రతి ఒక్కరికి చేనలల్లో బోర్లు వేసే ప్రతిపాదనలు సియం గారిని అడగగా సానుకూలంగా స్పందించిన సీఎం  కేసిఆర్ గారు బోర్లు కూడ వేసే ప్రతిపాదనలు ఒప్పుకున్నారు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు కొమురంభీం జిల్లా సమస్యల పై సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, అత్రం సక్కు కృతజ్ఞతలు తెలిపారు..