ఉమ్మడి జిల్లాలో స్మితా సబర్వాల్ పర్యటన.?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ ఈనెల 25వ తేదీన పర్యటించనున్నారు. ముందుగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీమ్ ప్రాజెక్ట్, వట్టివాగు ప్రాజెక్ట్ ను పనులను పరిశీలించిన అనంతరం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కాగజ్ నగర్ లోని జగన్నాథ్ పూర్ ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అక్కడి నుండి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని చనకా కొరాటా బ్యారేజ్ సైట్ కు చేరుకునున్నారు. చనకా కొరాటా పంపు హౌస్ పనులను పరిశీలించి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష చేపట్టనున్నారు..