నగల దుకాణంలో చోరీ..?
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: వాంకిడి మండల కేంద్రంలో ఉన్న ఓ బంగారం దుకాణంలోకి దొంగలు చొరబడి 241 తులాల వెండి ఆభరణాలు, 14 గ్రాముల బంగారం చోరీ చేశారు. బంగారం, వెండి అభరణాల మొత్తం విలువ రూ. 95, 250 ఉంటుందన్నారు. వాంకిడి ఎస్సై ఢీకొండ రమేశ్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన వనపర్తి శ్రీనివాస్ హనుమాన్ లైనులో నగల దుకాణం నడుపుతున్నారు. రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి ఇంటికెళ్లారు. గురువారం ఉదయం దుకాణానికి వెళ్లిన శ్రీనివాస్ చోరీ జరిగినట్లు గుర్తించి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు చేరుకుని హనుమాన్ మంది ర్ లైన్ లో ఉన్న దుకాణల వద్ద ఏర్పాటు చేసిన సీసీ పుటేజీల ఆధారంగా విచారణ మొదలెట్టారు. దొంగలు అర్ధరాత్రి దాటిన తరువాత బుల్లెట్ బైక్ పై వచ్చి దుకాణం వద్దకు చేరుకుని షటర్ ను ఐరన్ రాడ్ తో శాటర్ నీ పైకి లేపి లోపలికి వెళ్లి వెండి, బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లారనీ అన్నారు. దీంతో పోలీసు క్లూస్ టీం, డాగ్ స్కాడ్ సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు.
దొంగలను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మండల కేంద్రంలో ఉన్న దుకాణంలోనే చోరీ జరగడంతో స్థానిక వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆ దొంగలు సమీపంలోని మరో దుకాణం తాళాలు పగులగొట్టడానికి యత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. ఆ సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు..