Telugu Updates
Logo
Natyam ad

జబర్దస్త్ టీం సందడి..!

రాజన్న సిరిసిల్ల జిల్లా: రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా విశాలాక్షి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి జబర్దస్త్ టీమ్ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. మండల కేంద్రంలోని ఇందిరాచౌక్ ఏరియాలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయగా గురువారం జబర్దస్త్ టీం. సభ్యులైన చలాకి చంటి, వెంకీ మంకీ, నూకరాజు, ఫైమా తదితర జబర్దస్త్ టీం సభ్యులు హాజరై సందడి చేశారు. జబర్దస్త్ సభ్యులను చూసేందుకు రుద్రంగి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, నాయకులు తిరుపతి, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..