కాగజ్ నగర్ లోని రెండు ఇళ్లలో చోరీ..!
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ పట్టణం టీచర్స్ కాలనీలో ఘోరం. ఇంట్లో అందరు ఉండగానే భరితెగించిన దొంగలు. శనివారం రాత్రి టీచర్స్ కాలనీలోని రెండు ఇండ్లలో అందరూ పడుకున్నాక బీరువా తలుపులు తెరిచి దాదాపుగా ఆరు తులాల బంగారం, నగదును దొంగలు ఎత్తుకెళ్ళారు. ఉదయం లేచి చూసే సరికి బీరువా తలుపులు తెరిచి ఉండటం అన్నీ చిందరవందరగా పడి ఉండటంతో ఇంటి యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..