విద్యార్థినిలు సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి.
సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్
ఆంజనేయులు న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా: గంజాయి, మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని, పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి యోగ, మేడిటేషన్ లాంటివి అలవర్చుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం
సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్పీ అఖిల్ మహజాన్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు వాలీబాల్స్ అందజేషి, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులతో కలసి “సే నో టు డ్రగ్స్” పోస్టర్స్ ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలను తరిమికొట్టడంలో భాగస్వామ్యం కావాలని, మాధకద్రవ్యాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని అన్నారు. అందులో భాగంగా జిల్లాలో విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం తో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పటు చేసి జిల్లాలోని అన్ని పాఠశాలలో, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.