Telugu Updates
Logo
Natyam ad

బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.!

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్ లో గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్య క్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, కలెక్టర్ భారతీ హోలికెరీ, డిసిపి అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.