Telugu Updates
Logo
Natyam ad

కష్టకాలంలో మెరుగైన వైద్యం అందించాలి..

మంచిర్యాల జిల్లా: డాక్టర్స్ కష్టకాలంలో పేదలు, సామాన్యులకు సహాయ, సహకారాలతో పాటు మెరుగైన వైద్యం అందించాలని ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్ఎంపి వైద్యులు, అంబులెన్సుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితి లో వైద్యులు, అంబులెన్స్ యజమానులు డ్రైవర్లు ఒక ప్రాణం కాపాడే రక్షకుల ఉండాలన్నారు. ఆపదలో ఆదుకునే అంబులెన్స్ డ్రైవర్లు సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు రోదిస్తున్నా కొందరు డబ్బుల కోసం ఆలోచిస్తున్నారన్నారు. అత్యవసర చికిత్స సమయంలో ప్రజల అవసరాలను బట్టి అంబులెన్సు యజమానులు విపరీతమైన డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో చార్జీల బోర్డ్ ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రులను టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ చేస్తామని ఆయన తెలిపారు. ఎక్కడైనా చార్జీల వివరాలు వెల్లడించని పక్షంలో నిరంతరం అందుబాటులో ఉండే పోలిస్ హెల్ప్ లైన్ సెంబర్ 8341625367, డయల్ 100 ద్వారా సైతం సమాచారం ఇస్తే సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సమావేశంలో వైద్య, రవాణా శాఖ అధికారులు, ఏసీపీ తిరుపతిరెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు..