అక్రమ నిర్మాణాల తొలగింపు.
కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ అంజయ్య
ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలోని కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించడం జరిగిందని కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ అంజయ్య తెలిపారు. గురువారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని బస్టాండ్ వెనుక గల సర్వేనెంబర్ 143లో మున్సిపల్ నైట్ షెల్టర్ కొరకు కేటాయించిన ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన బేస్ మెంట్, రోడ్డును ఆక్రమించి చేపట్టిన షెడ్ తో పాటు ఇట్టి భూమిలో రోడ్డును ఆక్రమించే నిర్మించిన నిర్మాణాన్ని తొలగించడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని, నిబంధనలు ముల్లంగించినట్లైతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి.ఐ., పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్, ఎస్. ఐ., మున్సిపల్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.