Telugu Updates
Logo
Natyam ad

మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు..?

జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ

జగిత్యాల జిల్లా: మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని ఎస్పీ సింధు శర్మ తెలియజేశారు. మానవ అక్రమ రవాణాను నిర్మూలించడానికి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ను జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మహిళలపై అత్యాచారం, అసభ్యంగా దాడి చేయడం, అనుచితంగా తాకడం మొదలైన లైంగిక నేరాల కేసులలో, మానవ అక్రమ రవాణాను నిరోదించడంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ప్రత్యేకత కలిగి ఉందన్నారు. మహిళల పై పెరిగిపోతున్న నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

పోలీస్ శాఖ మహిళా భద్రతకు కొరకు షి టీమ్స్ ఏర్పాటు ద్వారా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదని చెప్పారు..