Telugu Updates
Logo
Natyam ad

హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలి..!

మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండల కేంద్రంలోని బిసి బాలుర వసతి గృహాన్ని మద్యం అడ్డాగా మార్చిన వార్డెన్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ శనివారం విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం జేఏసీ చైర్మన్ చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డెన్ స్థానికంగా ఉండకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యా సౌకర్యాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రజలకు నమ్మకం ఉండేలా వార్డెన్ మల్లేష్ ను సస్పెండ్ చేసి, ఈ ఘటనపై విచారణ జరిపించాలని, అలాగే విద్యార్థులకు మద్యం అమ్మిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బచ్చలి ప్రవీణ్ కుమార్, చేరాల వంశీ, సాగర్, వేణు, చందు, సాయి, నవీన్, తదితరులు పాల్గొన్నారు..